ధోనీ నా హీరో : రణ్ వీర్

by Anukaran |   ( Updated:2020-08-16 01:50:10.0  )
ధోనీ నా హీరో : రణ్ వీర్
X

మహేంద్ర సింగ్ ధోని.. గ్రేటెస్ట్ కెప్టెన్.. అమేజింగ్ లీడర్.. డిఫరెంట్ స్ట్రాటజీస్.. ఇన్‌క్రెడిబుల్ మెమొరీస్.. ఇన్‌స్పైరింగ్ పర్సనాలిటీ.. ఇలాంటి ఎన్నో క్వాలిటీస్ అతడి సొంతం. ‘మహి’ క్రికెట్ జర్నీ ఇండియన్ క్రికెట్‌ను ప్రభావితం చేయడమే కాదు, మెరికల్లాంటి యువ ఆటగాళ్లను టీమిండియాకు అందించింది. హెలికాప్టర్ షాట్‌ను విన్నింగ్ షాట్‌గా మార్చి ఎన్నో విజయాలను అందించిన ధోని రిటైర్మెంట్ ప్రకటన.. అభిమానుల్లో బాధను మిగిల్చింది. బ్లూ జెర్సీలో ధోనీ ఇక కనబడడు అన్న ప్రకటనతో ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఒక్క ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడినా బాగుండేది కదా కెప్టెన్ కూల్.. అంటూనే ఐపీఎల్‌లో అమేజింగ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఇండియన్ క్రికెట్‌కు అద్భుత సేవలందించిన మహికి సోషల్ మీడియాలో థాంక్స్ చెప్తూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ధోనీతో తన ప్రయాణాన్ని షేర్ చేసుకున్నాడు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్.

మహేంద్ర సింగ్ ధోనీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన రణ్‌వీర్.. ఇది తన విలువైన వస్తువుల్లో ఒకటని చెప్పాడు. 2007/ 08లో ధోనీతో కలిసి తీసుకున్న ఈ ఫొటోను చిన్న రత్నంలాగా అభివర్ణించాడు. కర్జత్‌లోని ఎన్‌డి స్టూడియోలో ధోని యాడ్ షూట్ చేస్తున్నారన్న విషయం తెలిసిన వీర్.. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేందుకు ఒప్పుకున్నాడట. కేవలం ది గ్రేట్ ధోనీని ప్రత్యక్షంగా చూసేందుకు మాత్రమే ఈ పనిని ఎంచుకున్నానని తెలిపిన వీర్.. ఎక్కువ పని చేయించి తక్కువ డబ్బు చెల్లించినా సరే తాను పట్టించుకోలేదన్నారు. ఆ టైమ్‌లో షూటింగ్‌లో గాయపడ్డప్పటికీ, ధోనీని చూడాలనే ఆకాంక్ష.. తనతో ఫొటో దిగాలనే ఆశతో నొప్పితో కూడా వర్క్ కంటిన్యూ చేశానని చెప్పాడు. చివరగా మహిని కలిసినప్పుడు తన వినయం, విధేయత, దయతో నిండి ఉన్న ప్రవర్తన చూసి మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయాయని.. తన పట్ల మరింత గౌరవం, ప్రేమ పెరిగాయని చెప్పాడు.

తొలి సినిమా ‘బ్యాండ్ బాజా బరాత్’ చేసిన తర్వాత మెహబూబ్ స్టూడియోలో షూటింగ్ చేస్తున్నాడని తెలిసి ధోనీని కలిసేందుకు అన్ని పనులు వదిలేసి వెంటనే అక్కడ వాలిపోయానని చెప్పాడు వీర్. అప్పుడు ధోనీ.. ఫస్ట్ సినిమాలో తన నటన గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చారని.. ఆ టైమ్ లోనే తన క్యాప్, జెర్సీపై సిగ్నేచర్ తీసుకుని పొంగిపోయానని చెప్పాడు. ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌తో చాలా హ్యాపీగా ఉన్నానని.. మేఘాలపై నడుస్తున్న ఫీలింగ్ కలిగిందని చెప్పాడు. అప్పటినుంచి తనను కలిసిన ప్రతిసారీ చాలా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉన్నానని చెప్పిన రణ్‌వీర్.. ధోనీని తన పెద్ద అన్నగా అభివర్ణించారు.

ఇప్పటి వరకు ఉన్న గొప్ప క్రికెటర్లలో ఒక్కడైన ‘మహి’ ఆటకు సాక్ష్యంగా నిలిచినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. దేశానికి కీర్తి ప్రతిష్టలు అందించిన క్రీడా చిహ్నం ‘ధోని’ ఎప్పటికీ నా హీరో అని ధన్యవాదాలు తెలిపాడు రణ్‌వీర్.

https://www.instagram.com/p/CD8FVIthg3o/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story