- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీపై రంగోలి చందేల్ ఫైర్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై మండిపడ్డారు. దేశం అంటే అమితమైన భక్తి, ప్రేమ ఉన్న చందేల్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తుంటారు. అందుకే బీజేపీయేతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తుంది చందేల్.
అయితే శుక్రవారానికి పుల్వామా ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా … వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు రాహుల్. కానీ పుల్వామా ఉగ్రదాడి వల్ల లాభం పొందింది ఎవరు? అని ప్రశ్నించారు. దీంతో ఉగ్రదాడిని రాజకీయం చేస్తున్న రాహుల్ పై మండిపడింది రంగోలి. దేశం అంటే రాహుల్ గాంధీకి జోక్ అయిపోయిందని.. అమరులైన జవాన్లు అంటే గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జవాన్ల మరణాన్ని, అమరుల త్యాగాలను లెక్కచేయని రాహుల్‌ను ఉరితీయాలన్నారు.
న్యూస్ ఛానల్స్ సైతం రాహుల్ స్టేట్‌మెంట్‌ను ఎందుకు హైలెట్ చేస్తున్నాయని ప్రశ్నించింది. ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచిదని…. కానీ ఛానల్స్ మాత్రం రాహుల్ మాటలతో ఏదో జ్ఞానోదయం అయినట్లు ఒకే తీరుగా వార్తను ప్రసారం చేస్తున్నాయన్నారు.