24న రంగనాయక సాగర్ ప్రారంభం

by Shyam |
24న రంగనాయక సాగర్ ప్రారంభం
X

దిశ, మెదక్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను శుక్రవారం మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ప్రారంభించనున్నారు. సాగర్ ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సి ఉండగా కరోనా వ్యాప్తి కారణంగా ఆయన హాజరు కాలేకపోతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా మంత్రులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే అనంతగిరి (అన్నపూర్ణ ) రిజర్వాయర్ నుంచి సొరంగ మార్గం ద్వారా రంగనాయక సాగర్‌కు చెందిన సర్జ్ పూల్‌కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి నాలుగు మోటార్ల ద్వారా రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. సముద్ర మట్టానికి 490 మీటర్ల ఎత్తులో ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు.

Tags: ranga nayak sagar project , 24th april, ministers ktr, harish rao opening, siddipet

Advertisement

Next Story

Most Viewed