కీర్తి సురేష్ మిస్సింగ్.. హీరో నితిన్ ట్వీట్ వైరల్.. హైదరాబాద్ పోలీస్ ఫన్నీ రిప్లై!

by Jakkula Samataha |   ( Updated:2021-03-20 12:52:57.0  )
కీర్తి సురేష్ మిస్సింగ్.. హీరో నితిన్ ట్వీట్ వైరల్.. హైదరాబాద్ పోలీస్ ఫన్నీ రిప్లై!
X

దిశ, సినిమా : హీరోయిన్ కీర్తి సురేష్, హీరో నితిన్ తొలిసారిగా ‘రంగ్ దే’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, రంగ్ దే మూవీ ప్రమోషన్‌ను చిత్ర బృందం డిఫెరెంట్‌గా ప్లాన్ చేసింది. ఈ సినిమాను వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తుండగా.. మార్చి 26న సినిమా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌‌లో భాగంగా నటీ నటులు తమపై తామే సెటైర్ వేసుకుని కొత్తగా ప్రమోషన్ మొదలు పెట్టారు.

‘ మూవీ రిలీజ్‌కు వారం రోజులు కూడా లేదు.. ఇంకెప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారంటూ హీరో నితిన్‌కు కమెడియన్స్ సుహాస్, అభినవ్ ఫోన్ చేస్తారు. అక్కడి నుంచి మొదలైంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు విడుదల కాగా, ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, కీర్తి సురేష్‌ను ముందు పెట్టి చిత్ర బృందం తెలివిగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే నితిన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

హీరోయిన్ కీర్తి సురేష్ చిన్నప్పటి పిక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన నితిన్.. ‘‘ఈ అమ్మాయి కనిపించడం లేదంటూ టాగ్ ఇచ్చాడు. దాని కింద డియర్ అను.. నువ్వు ఎక్కడున్నా వెంటనే రంగ్ దే ప్రమోషన్స్‌లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా.. ఇట్లు నీ అర్జున్’’ అంటూ పోస్ట్ చేశాడు. అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. అది అంతటితో ఆగలేదు. ఈ ట్వీట్‌పై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ‘మీరేం కంగారు పడకండి నితిన్.. మేం చూసుకుంటాం’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ రిప్లై నితిన్ ఫ్యాన్స్‌తో పాటు రంగ్ దే టీంను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

https://twitter.com/hydcitypolice/status/1373260223528329219?s=1001

Advertisement

Next Story