- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రణ్‌బీర్ ఖాతాలో మరో హీరోయిన్ బలి.. ఇదిగో సాక్ష్యమంటున్న నెటిజన్స్
దిశ, సినిమా : బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ జంట ఒక ఫంక్షన్‌కు హాజరవగా, అక్కడ రణ్‌బీర్ చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. విషయానికొస్తే.. తాము కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుతూ ముంబైలోని సర్బోజనిన్ దుర్గా పూజ సమితిలోని కాళీ మాతను సందర్శించారు.
ఈ సందర్భంగా మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్‌లో సందడి చేసిన ఈ బీటౌన్ జోడీ.. పూజ ముగించుకుని స్టేజ్‌పై నుంచి కిందకు దిగుతుండగా ఆలియా లెహంగా చున్నీ కిందపడింది. అయితే వెనకే వస్తున్న హీరో ఆ చున్నీని కాలితో పక్కకు జరపడం కెమెరా కంటికి చిక్కింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని ప్రవర్తనపై మండిపడుతున్నారు. రణ్‌బీర్‌కు పొగరు ఎక్కువని, అసలు ఆలియాపై తనకు ప్రేమే లేదని కామెంట్స్ చేస్తుండటంతో పాటు చాలా స్వార్థపరుడని విమర్శిస్తున్నారు.