- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలియాతో పెళ్లిపై రణ్‌బీర్ కామెంట్.. వైరల్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. రేపో మాపో పెళ్లి అయిపోతుందని చాలా సార్లు వార్తల్లోకెక్కారు ఇద్దరు. కానీ, అభిమానులు కోరుకున్న ఆ తంతు మాత్రం ఇంకా జరగనేలేదు. కాగా, తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న రణ్‌బీర్..గర్ల్ ఫ్రెండ్ ఆలియాతో వివాహంపై స్పందించాడు.
కరోనా లేకపోయి ఉంటే ‘మ్యారేజ్ గోల్’కు ఇప్పటికే టిక్ మార్క్ పడిపోయి ఉండేదని తెలిపాడు. చాలా త్వరగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నానని తెలిపాడు. లాక్‌డౌన్‌లో ఆలియా ‘ఓవర్ అచీవర్’ అని కాంప్లిమెంట్ ఇచ్చిన రణ్‌బీర్..గిటార్ నుంచి స్క్రీన్ రైటింగ్ వరకు అన్నీ నేర్చుకుందని పేర్కొన్నాడు. ఆలియాతో పోలిస్తే తను ‘అండర్ అచీవర్’ అని..కొత్తగా, ప్రత్యేకంగా ఎలాంటి క్లాసులు తీసుకోలేదని, పుస్తకాలు చదవడం, ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు చూడటం, ఫ్యామిలీతో స్పెండ్ చేయడంతో లాక్ డౌన్ గడిచిపోయిందని చెప్పాడు. రణ్‌బీర్, ఆలియా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్, డింపుల్ కపాడియా ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది.