తుదిదశలో రణ్‌బీర్-ఆలియా ‘బ్రహ్మాస్త్ర’

by Jakkula Samataha |
తుదిదశలో రణ్‌బీర్-ఆలియా ‘బ్రహ్మాస్త్ర’
X

దిశ, సినిమా: విజువల్ గ్రాండియర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 4న విడుదల కావాల్సి ఉంది. కానీ, కొవిడ్ వల్ల చిత్రీకరణ ఆగిపోవడం, ఇతరత్రా కారణాలతో మూడేళ్ల నుంచి షూటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఫైనల్ సీన్స్ కోసం త్వరలోనే రణ్‌బీర్-ఆలియా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, ఇతర పనులను మూవీ యూనిట్ కొంతమేరకు పూర్తి చేసింది. కాగా, హీరో హీరోయిన్ ఫైనల్ సీన్స్ షూటింగ్ కోసం మూవీ మేకర్స్ ముంబైలోని స్టూడియోలో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సెట్‌లో వారం రోజుల పాటు సీన్ల చిత్రీకరణ జరగనుంది. కాగా ‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ కపూర్ సూపర్ హీరోగా కనిపించనున్నారు. ఫైనల్ సీన్స్, వీఎఫ్‌ఎక్స్, ఎడిటింగ్ వర్క్ పూర్తికాగానే మూవీ రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Advertisement

Next Story