రానా పెళ్లి వేదికగా.. ఫలక్‌నుమా ప్యాలెస్

by Shyam |   ( Updated:2020-06-21 02:06:30.0  )
రానా పెళ్లి వేదికగా.. ఫలక్‌నుమా ప్యాలెస్
X

దగ్గుబాటి ఫ్యామిలీ యంగ్ హీరో రానా.. బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నారు. ‘సింగిల్ కింగ్స్’ అంటూ పాట పాడిన తనే ఇప్పుడు పెళ్లి చేసుకుని మింగిల్ కాబోతున్నాడు. ఈ లాక్‌డౌన్‌లో తన ప్రియురాలు మిహికా బజాజ్‌ను అభిమానులకు ఇంట్రడ్యూస్ చేసి.. రోకా ఫంక్షన్‌తో ఆ బంధాన్ని లీగల్ చేసుకున్న రానా.. ఆగస్ట్ 8న పెళ్లి చేసుకోబోతున్నాడు. కాగా హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్.. రానా, మిహికాల మూడుముళ్ల బంధానికి వేదిక కానుందని సమాచారం. కాగా ఈవెంట్ మేనేజర్ అయిన మిహికానే దగ్గరుండి మరీ అన్ని పనులను పర్యవేక్షించనుందని తెలుస్తోంది. కరోనా కారణంగా కొద్ది మంది బంధు మిత్రుల నడుమ లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ వివాహ మహోత్సవం జరగనున్నట్టు సమాచారం.

కాగా, రానా అరణ్య సినిమా.. షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికే విడుదలకు సిద్ధం కాగా.. విరాటపర్వం చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ కాగా ప్రియమణి.. కామ్రేడ్ భరతక్క పాత్రలో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story