ముందు షాకైనా.. ఓకే చెప్పింది : రానా

by Shyam |
ముందు షాకైనా.. ఓకే చెప్పింది : రానా
X

రానా దగ్గుబాటి ఆగస్ట్ 8న మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ మీడియాతో మాట్లాడిన రానా.. మిహికా చాలా మంచిదని, బాగా అర్ధం చేసుకుంటుందని తెలిపాడు. తను మా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందని, తనతో చాలా టైమ్ స్పెండ్ చేసేవాడినని తెలిపాడు. ఇప్పుడు పెళ్లి చేసుకునే టైమ్ వచ్చిందని అనుకుంటున్నానని.. పరిస్థితులు కూడా స్మూత్‌గా వెళ్తూ సపోర్ట్ చేస్తున్నాయని తెలిపాడు రానా. మేమిద్దరం గ్రేట్ కపుల్ అవుతామన్న రానా.. పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగుతామని చెప్పాడు. ఆగస్ట్ 8న పెళ్లి చేసుకోబోతున్నామని.. ఆ రోజు తన వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమమైన, ప్రత్యేకమైన రోజని తెలిపారు.

మిహికా.. వెంకటేష్ కూతురు ఆశ్రిత స్నేహితురాలు కాగా, తనతో చాలా ఏళ్లుగా పరిచయమున్నా, లాక్‌డౌన్ ముందు నుంచే తనను పెళ్లి చేసుకోవాలని అప్రోచ్ అయినట్లు చెప్పాడు. ఫోన్‌లో కాకుండా తనను పర్సనల్‌గా కలిసి మాట్లాడి ఒప్పించినట్లు చెప్పారు రానా. ముందుగా తను షాక్ అయినా.. తర్వాత హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలిపారు.

Advertisement

Next Story