ప్రాణాలు పోతే‌గాని పట్టించుకోరా?

by Aamani |
ప్రాణాలు పోతే‌గాని పట్టించుకోరా?
X

దిశ, ఆదిలాబాద్: వారంతా ఓ కాలనీవాసులు. తమ సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా లాభం లేదు. వారి సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు. దీంతో ఆగ్రహించిన సదరు కాలనీవాసులు ధర్నాకు దిగారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో చోటుచేసుకుంది. స్థానిక రంజాన్‌పుర కాలనీలో తరుచుగా హై ఓల్టేజ్ విద్యుత్ తీగలు పడిపోతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాలనీ వాసులు ఆందోళన బాటపట్టారు. విద్యుత్ అధికారుల తీరుకు నిరసనగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివారం ధర్నా చేశారు. దీంతో తీవ్ర ట్రాఫిక్‌జాం అయింది. అనంతరం విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలుసుకున్న ఇచ్చోడ ఎస్సై పుల్లయ్య ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు.

Advertisement

Next Story

Most Viewed