రేఖ పర్‌ఫార్మెన్స్ చూసి కన్నీరు పెట్టుకున్న రమ్యకృష్ణ

by Shyam |
Ramya Krishnan Got Emotional
X

దిశ, సినిమా : లెజెండరీ బాలీవుడ్ యాక్టర్ రేఖ.. ఇండియన్ ఐడల్ 12 స్పెషల్ గెస్ట్‌గా ఆహ్వానించబడింది. ఈ క్రమంలో తను చేసిన అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కోస్టార్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. 64 ఏళ్ల రేఖ చేసిన గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోగా.. ఈ షోను టీవీలో చూసిన హీరోయిన్ రమ్యకృష్ణ ఎమోషనల్ అయిపోయి కన్నీరు పెట్టుకుంది. రేఖ పర్‌ఫార్మెన్స్‌కు మెస్మరైజ్ అయిన తను గర్వంతో ఆనందభాష్పాలు రాల్చింది.

‘మై గాడ్.. మై గాడ్.. మై గాడెస్ రేఖ జీ..’ అంటూ తన ఎగ్జైట్‌మెంట్‌ను క్యాప్షన్‌ చేసిన రమ్యకృష్ణ.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు క్వీన్స్‌ను చూస్తున్నట్లు ఉందని చెప్తున్నారు. రమ్యకృష్ణకు రేఖ పట్ల ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఈ వీడియోలో కనిపిస్తోందని, వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.

Advertisement

Next Story