పెళ్లి సంబంధం చెడగొట్టిందని..

by srinivas |
పెళ్లి సంబంధం చెడగొట్టిందని..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. రామకృష్ణ అనే యువకుడు ఓ మహిళను అత్యంత కిరాతంగా నరికి చంపాడు.ఈ ఘటన బెజవాడలోని వించిపేటలో శనివారం ఉదయం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. విత్తనాల పైడమ్మ అనే మహిళ గతంలో రామకృష్ణకు వచ్చిన పెళ్లి సంబంధ చెడగొట్టింది.ఈ కారణంతోనే అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ప్రతీకారం కోసం ఎదురుచూసిన ఆ యువకుడు ఇవాళ ఉదయం ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్యచేశాడు.ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురించేసింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story