‘రామ్‌సింగ్ చార్లి’.. జీవితమే పెద్ద సర్కస్!

by  |
‘రామ్‌సింగ్ చార్లి’.. జీవితమే పెద్ద సర్కస్!
X

దిశ, వెబ్‌డెస్క్ :
కొన్ని చిన్న సినిమాలే.. చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. కంటెంట్, కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండి, టేకింగ్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటే.. ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. మంచి రేటింగ్‌తో సూపర్ హిట్ ఇచ్చేస్తారు. అలాంటి బాలీవుడ్ సినిమానే ‘రామ్‌సింగ్ చార్లి’.

రామ్‌సింగ్ అనే వ్యక్తి సర్కస్ మీద ఆధారపడి జీవిస్తాడు. చిన్ననాటి నుంచి కూడా తన జీవితం మొత్తం సర్కస్‌తోనే ముడిపడి ఉంటుంది. తను చేసే విన్యాసాలు జనాన్ని ఆకట్టుకోగా.. చార్లిగా పిలవబడతాడు. కానీ టీవీ, మొబైన్ ఫోన్స్ వచ్చాక సర్కస్‌కు ఆదరణ లేదని ఓనర్స్‌ సర్కస్ మూసేస్తారు. దీంతో మరో జీవనోపాధి కోసం ప్రయత్నించే సమయంలో ఎలాంటి బాధలు ఎదుర్కొన్నాడు? హోటల్‌లో పని దొరికినా, రేపటి నుంచి పనిలోకి రావద్దని చెప్పడం.. బతుకుబండి నడిపించేందుకు బండి లాగడం.. లాంటి సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. కానీ చివరికి ఆ ఉపాధి కూడా కరువవుతుంది. ‘నేను ఇన్నాళ్లూ మిమ్మల్ని అందరినీ నవ్వించిన చార్లిని.. ఒక ఉద్యోగం ఇప్పించండి’ అని ఎంత మందిని వేడుకున్నా సరే, ప్రయోజనం లేకుండా పోతుంది. దీంతో జీవితమే పెద్ద సర్కస్‌‌లా అనిపిస్తున్నసమయంలో.. తన భార్య చెప్పిన మాటలు తన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. సర్కస్‌లో నటించేందుకే పుట్టిన వ్యక్తికి వేరే పని ఎందుకు దొరుకుతుంది? అదే పని చేయ్.. అని చెప్పడంతో.. యజమానిని ఒప్పించి సర్కస్ రీఓపెన్ చేస్తాడు.

‘జీవించడానికి ఒక కల.. ఒక విషయం మీద చచ్చిపోయేంత అభిరుచి ఉంటే తప్పకుండా అనుకున్నది సాధించవచ్చు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన రామ్‌సింగ్ చార్లి సినిమా ఐఎండీబీలో 8.2 రేటింగ్ సాధించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. సోనీ లైవ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా పర్‌ఫెక్ట్ ఎమోషనల్ జర్నీ కాగా.. విమర్శకులచే శభాష్ అనిపించుకుంటోంది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్‌సింగ్ చార్లి’ సినిమాలోకుముద్ మిశ్రా టైటిల్ రోల్ పోషించాడు. దివ్యా దత్త చార్లి భార్యగా కనిపించగా.. ఆకర్ష్ ఖురానా, సలీమా రజా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా, ఈ పాత్ర కోసం కుముద్.. 20 కేజీలు తగ్గారట.



Next Story

Most Viewed