రియా విషయంలో సిగ్గుపడుతున్నా..

by Shyam |   ( Updated:2023-10-12 06:22:06.0  )
రియా విషయంలో సిగ్గుపడుతున్నా..
X

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విషయంలో రియా చక్రవర్తిని దోషిగా చూపిస్తున్నారని మీడియాపై మండిపడ్డారు రామ్ గోపాల్ వర్మ. మీరే డిసైడ్ చేస్తున్నప్పుడు ఇంకా సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకని ప్రశ్నించారు. ఇప్పుడు తనను ప్రజలకు చూపిస్తున్న మీడియా.. రేపు తను నిర్దోషి అని సీబీఐ నిర్ధారిస్తే ఏం చెప్తారని ప్రశ్నించారు. రిపబ్లిక్ చానల్ అర్ణబ్ గోస్వామి జర్నలిస్టుగా తన పని తాను చేస్తున్నా సరే.. ఇలాంటివి నిర్ధారించే ముందు మానవత్వంతో ఆలోచించాలని సూచించాడు. ఇలాంటి ఎఫెక్ట్స్‌తో న్యూస్ ప్రసారం చేస్తే రియా భవిష్యత్, కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయో కొంచెం అయినా ఆలోచించాలని అన్నారు.

తోటి నటీనటులు కూడా తనకు సపోర్ట్‌గా నిలవకపోవడం, అసలు తాము రియా విషయంలో ఏం అనుకుంటున్నారో చెప్పకుండా.. మీడియా ముందు మాట్లాడుతున్న తనకు మెసేజ్‌లు చేస్తూ అప్రిషియేట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. మీకంటూ స్వేచ్ఛ ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్‌ను ఎందుకు బయటపెట్ట లేకపోతున్నారని ప్రశ్నించారు.

నిజానిజాలు తెలియకుండా రియాను వేటాడడం, మానసికంగా హింసించడం కరెక్ట్ కాదన్న వర్మ.. కంగనా రనౌత్ తాను బాలీవుడ్ ప్రముఖుల వల్ల చాలా ఇబ్బంది పడ్డానని.. నేను బాధితురాలినని చెప్పింది కదా.. ఇప్పుడు తను చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story