- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అర్నాబ్ ముందు దావుద్ ఒక బచ్చా’
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రాం గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రావర్సీ లేందే సినిమా తీయడు. అటువంటి ఆయన ట్విట్టర్ వేదికగా ముంబై పోలీసులకు ఓ లేఖ రాశాడు. ఈ లేఖలో రిపబ్లిక్ చానెల్ పై హాట్ కామెంట్స్ చేసి తన వైఖరిని ప్రదర్శించాడు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
https://twitter.com/RGVzoomin/status/1302270624027480071?s=20
‘ప్రియమైన ముంబై పోలీసులు.. మీరు కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలతో ఆదర్శప్రాయంగా నిలిచారు. కానీ, ‘రిపబ్లిక్’ మాఫియా మాత్రం ముంబై పోలీసులను ఎన్‌కౌంటర్ చేసింది.. దీంతో మీ కోసం నేను ఏడుస్తున్నాను.. సమాజం కోసం ఉపయోగపడేలా ఏదైనా చేయండి’ అంటూ ట్వీట్ చేశాడు.
మరో ట్వీట్‌లో.. రిపబ్లిక్ మాఫియా కంటే సమాజానికి హాని కలిగించే ఏ మాఫియాను మీరు ఎప్పుడైనా చూశారా.. అర్నాబ్‌తో పోలిస్తే దావూద్ ఇబ్రహీం చిన్న పిల్లవాడు.. అంటూ ముంబై ఉన్నతాధికారులను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.