అరియానాతో RGV సెక్స్?.. రిలేషన్‌షిప్‌లో తప్పులేదన్న వర్మ

by Shyam |   ( Updated:2021-07-11 02:25:57.0  )
ariyana-glory-and-rgv
X

దిశ, సినిమా : ‘ఆర్జీవీ టాక్స్ బోల్డ్ విత్ అరియానా’.. ఈ రొమాంటిక్ ఇంటర్వ్యూకు యూట్యూట్‌లో 11 లక్షలకు పైగా వ్యూస్, వేలల్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చాయి. కొందరు దేశంలో అసలైన ఫ్రీడమ్‌ అనుభవిస్తుంది ఒక్క ఆర్జీవీ మాత్రమే అని మెచ్చుకుంటే.. చాలా మంది మాత్రం అరియానా, వర్మలను కలిపి పచ్చిబూతులు తిట్టారు. కొన్ని రోజులైతే ఆర్జీవీ చేతుల్లో మోసపోయానని అరియానా మీడియాను ఆశ్రయిస్తుందని, ఇంత బోల్డ్‌గా ఇంటర్వ్యూ చేస్తుంటే మహిళా సంఘాలు ఏమై పోయాయని ప్రశ్నించారు. ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ అభిప్రాయాలు విన్నాక.. ‘నీదే ఓ సిగ్గులేని బతుకు.. మళ్లీ ఇందులో నీతివాక్యాలా?’ అన్నవారు కూడా లేకపోలేరు. నిజంగా ఆర్జీవీ అంత దరిద్రంగా తన ఒపీనియన్ చెప్పాడా? లేక సొసైటీని అర్థం చేసుకుని ప్రాక్టికల్‌గా మాట్లాడాడా? అనేది పర్సనల్ పర్సెప్షన్‌ను బట్టి ఎవరికివారు అంచనా వేసుకోవచ్చు.

ఇంటర్వ్యూలో భాగంగా ‘నేను సత్యహరిశ్చంద్రుడి మరో అవతారం, నిజాలే మాట్లాడుతా’ అంటూ అరియానా ప్రశ్నలకు బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చిన వర్మ.. సెక్స్, లెస్బియన్ రిలేషన్, రిలేషన్‌షిప్ స్టేటస్, హీరోయిన్ అప్సరతో ఎఫైర్, మూవీస్‌పై కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ ఇచ్చి నెటిజన్లతో బూతులు తిట్టించుకున్నాడు.

సెక్స్ అంటే ఫిజికల్ టచ్ మాత్రమే కాదు .. ఓ అమ్మాయిని తప్పుడు భావనతో చూస్తూ ఫీలింగ్ పెంచుకున్నా సరే అది సెక్స్ అవుతుంది. జిమ్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా అరియానా బాడీని చూసి అలాగే ఫీల్ అయ్యానని, అంటే అరియానతో కూడా సెక్స్ చేసినట్లేనని చెప్పాడు. ఒక అమ్మాయితో సెక్స్ చేసినంత వరకు మాత్రమే ప్రేమలో ఉండాలి.. ఆ తర్వాత ఎలాంటి ఎమోషన్స్ పెంచుకోకూడదు. అలా పెంచుకుంటే తలనొప్పులు తప్పవని సూచించాడు. అందుకే ఒక రిలేషన్ షిప్ స్టేటస్ అనేది గంటల్లో మాత్రమే ఉండాలని చెప్పాడు. లెస్బియన్ సెక్స్ గురించి మాట్లాడిన ఆయన.. ఒక అమ్మాయిని చూస్తేనే కళ్లకు ఎంతో ఆనందంగా ఉంటుంది? అలాంటిది ఇద్దరు అమ్మాయిలు కలిసి సెక్స్ చేశారంటే.. ఆ ఇంపాక్ట్ డబుల్ ఉంటుంది. అందుకే లెస్బియన్ సెక్స్ అంటే తనే కాదు, చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఇష్టపడుతారని వివరించాడు ఆర్జీవీ.

లైఫ్ అంతా ఒకే పార్టనర్‌తో గడపడాన్ని తెలివి తక్కువ ఆలోచనగా వర్ణించిన వర్మ.. ‘జీవితాంతం ఒకే భర్త, ఏకపత్నీ వ్రతుడు’ లాంటి పెద్దల మాటలు విని చెడిపోకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని సూచించాడు. ‘వెరైటీ ఈజ్ ది స్పైస్ ఆఫ్ లవ్’ అన్న సిద్ధాంతాన్ని ఫాలో అయిపోతేనే జీవితాన్ని ఆనందంగా అనుభవించినట్లని తెలిపాడు. ఒక అమ్మాయి బోల్డ్‌గా కనిపిస్తుంది.. బరితెగించి ప్రవర్తిస్తుంది.. అనే మాటలు కేవలం మనల్ని చూసి ఈర్ష్య పడినవారే మాట్లాడుతారు. ఒకవేళ అదే అందాన్ని వారు కలిగి ఉంటే పబ్లిక్‌లో షో చేసేందుకు ముందుంటారు.. ఇలాంటి కామెంట్స్‌కు అసలు రియాక్ట్ కాకుండా మనం ఏవిధంగా ఉండాలని అనుకుంటున్నామో అలాగే ఉండటం మంచిదని సూచించారు. ధనవంతుడికి డబ్బు ఎలాగో అమ్మాయికి అందం అలాంటిది.. ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తే ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి అన్నారు ఆర్జీవీ.

Advertisement

Next Story