- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాట్ టాపిక్.. RRR రిలీజ్ వేళ ప్రభుత్వానికి RGV ఇంట్రెస్టింటింగ్ అడ్వైజ్
దిశ, వెబ్‌డెస్క్ : వివాదాలకు కేరఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ.. ఎవ్వరేమనుకున్నా.. తనకు నచ్చినట్లు బతకడమే రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. వివాదాలు సృష్టించడంలో, వాటికి వివరణ ఇవ్వడంలో వర్మకు మించిన వారు లేరు అంటారు అభిమానులు. అంతే కాకుండా తనకు ఏది అనిపిస్తే అది చెబుతూ ఉంటాడు. తాజాగా వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రభుత్వానికి ఓ సలహా ఇవ్వనా అంటూ తనదైన శైలిలో ఆర్.ఆర్.ఆర్ సినిమాను ప్రభుత్వానుద్దేశించి ట్వీట్ చేశారు. అందులో ప్రస్తుతం కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.. అలాగే ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతోంది. అందువలన నేను ప్రభుత్వానకి ఓ సలహా ఇస్తానంటూ.. ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి, మరో వైపు చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ గురించి ప్రభుత్వానికి చెప్పడానికి నా దగ్గర గొప్ప ఆలోచన ఉంది. కరోనా విజృంభన కొనసాగుతున్నా ఇప్పటికిీ చాలా మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. అందువలన త్వరలో విడుదల కాబోయే ఆర్.ఆర్. ఆర్ సినిమా చూడటానికి థియేటర్లలోకి డబుల్ డోస్ వ్యాక్సిన్ రుజువు చూసిస్తే తప్ప ఎవరినీ అనుమతించకండి.. RRR చూడాలనే కోరిక ప్రజల అజాగ్రత్తను జయిస్తుంది అంటూ ట్వీట్ చేశారు.
I have a GREAT idea for the GOVERNMENT regarding OMICRON😎😎😎…They should not allow anyone into #RRR theatres unless they show proof of DOUBLE DOSE ..The DESIRE to see #RRR will CONQUER the CARELESSNESS of the PEOPLE 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2021