కొత్త దర్శకుడితో చరణ్ ?

by Anukaran |   ( Updated:2020-07-03 03:57:07.0  )
కొత్త దర్శకుడితో చరణ్ ?
X

మెగా పవర్‌ర్త‌స్టార్ రామ్ చరణ్ తేజ్.. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మన్నెందొర అల్లూరి సీతారామరాజుగా రిలీజ్ చేసిన చరణ్ లుక్ అదిరిపోయింది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం.. త్వరలోనే మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా పూర్తికాగానే తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటించనున్న చరణ్.. లాక్‌డౌన్ లోనూ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల గురించి ఆలోచించారట. చాలా మంది దర్శకుల కథలు విన్న ఆయన.. ఓ కొత్త డైరెక్టర్ స్టోరీకి ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. సతీశ్ అనే డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలని సూచించారట. ఫైనల్ స్టోరీ నచ్చితే ‘ఆచార్య’ తర్వాత అదే ప్రాజెక్ట్ చేస్తానని హామీ ఇచ్చారట. దీంతో స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట ఆ కొత్త దర్శకుడు.

ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న చరణ్.. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతన్నాడు. ఉపాసనకు పనుల్లో హెల్ప్ చేస్తున్న చెర్రీ.. నానమ్మ దగ్గర వంటింటి పాఠాలు కూడా నేర్చుకున్నాడు. కాగా కొత్తగా రిలీజ్ అయిన వీడియోలో చరణ్ లుక్ పూర్తిగా మారిపోయింది.

Advertisement

Next Story

Most Viewed