జ్యోతి వెలిగిద్దాం… కరోనాలేని భారత్ సాధిద్దాం

by Shyam |
జ్యోతి వెలిగిద్దాం… కరోనాలేని భారత్ సాధిద్దాం
X

కరోనా వైరస్ కట్టడికి ప్రతీ ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రజలను లాక్ డౌన్ ఫాలో కావాలని సూచనలు అందిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు ఇళ్లకు పరిమితమై లాక్ డౌన్ విజయవంతం చేయడాన్ని అభినందించారు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14 వరకు ఇళ్లు దాటి బయటకు రావొద్దని సూచించారు. కరోనా నిర్మూలనలో భాగంగా భారత ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు లైట్స్ ఆర్పేసి…. ప్రతీ ఇంట్లోనూ తొమ్మిది నిమిషాల పాటు దీపాలను వెలిగించాలని కోరారు. జ్యోతి వెలిగించి… కరోనా లేని భారత్ ను సాధిద్దామని పిలుపునిచ్చారు చరణ్. కాగా కరోనా మహమ్మరిపై చేస్తున్న పోరులో భాగంగా చరణ్ తెలుగు రాష్ట్రాలకు రూ. 70 లక్షలు, సినీ కార్మికులకు రూ. 30 లక్షల విరాళాన్ని అందించారు.

మోడీ పిలుపుకు మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు తెలిపారు. దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు మోడీని ఫాలో అవుదామని అభిమానులకు సూచించారు. అయితే కొందరు మోడీ పిలుపును తప్పు పడుతుంటే… దీపాలు వెలిగించడం ద్వారా మనమంతా ఒక్కటి అనే భావన కలిగించడమే ప్రధాని ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు మరికొందరు.

tags: Ram Charan Teja, Modi, CoronaVirus, Covid 19

Advertisement

Next Story

Most Viewed