లవ్ యూ మై హీరో : చరణ్

by Shyam |
లవ్ యూ మై హీరో : చరణ్
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ తేజ్… టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘చిరుత’గా ఎంట్రీ ఇచ్చి… బాక్సాఫీస్ ‘మగధీర’ అయ్యాడు. ‘ఆరెంజ్‌’తో ‘రచ్చ’ చేసిన చెర్రీ… ‘గోవిందుడు అందరివాడేలే’ అనిపించుకున్నాడు. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా ప్రేక్షకులకు మరింత దగ్గరైన చరణ్… ‘ధృవ’ తారగా సినీ ఇండస్ట్రీలో వెలుగుతూనే ‘వినయ విధేయ రాముడి’గా అలరించాడు. జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రౌద్రాన్ని ప్రదర్శంచబోతున్న చెర్రీకి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న్ చరణ్… నటుడిగానే కాదు నిర్మాతగాను రాణిస్తున్నాడు. తండ్రిని కథానాయకుడిగా ఎంచుకుని నిర్మాతగా భారీ లాభాలు అందుకున్న చరణ్ … తండ్రికి తగిన కాదు… తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఇలాంటి మాటలు విన్న ఏ తండ్రైనా పుత్రోత్సాహాన్ని పొందుతాడు. ఆ ఆనందమే పొందిన చిరు… చెర్రీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశాడు. చరణ్ పుట్టినప్పుడు సహజంగానే చాలా ఆనందపడ్డానని తెలిపాడు చిరు. కానీ ఆ తర్వాత అర్ధమైంది ఎందుకు అంతగా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేది… చరణ్ ‘ప్రపంచ రంగస్థల దినోత్సవం(వరల్డ్ థియేటర్ డే)’ రోజున పుట్టడమే అందుకు కారణం. చరణ్ నటనా ప్రావీణ్యం గురించి ప్రశంసించిన చిరు… చెర్రీకి నటనకు ఉన్న సంబంధం’ నీటికి చేపకు’ ఉన్న అనుబంధం లాంటిదని అభివర్ణించారు.

చిరు ట్వీట్‌తో భావోద్వేగానికి లోనైన రామ్ చరణ్… నా హీరో నుంచి ఇలాంటి హృదయ స్పందన పదాలు వినడం ఆనందంగా ఉందని తెలిపారు. పుట్టినరోజుతో ఏదైనా సంబంధం ఉందో లేదో నాకు తెలియదు… కానీ మా డాడికి తెలుసు. మీరు నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ విషయానికి థాంక్యూ డాడీ అంటూ ట్వీట్ చేశాడు.


Tags: Ram Charan Tej, HBD, Chiranjeevi

Advertisement

Next Story

Most Viewed