చెర్రీతో కేక్ కట్ చేయించిన ఉపాసన

by Shyam |
చెర్రీతో కేక్ కట్ చేయించిన ఉపాసన
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శుక్రవారం 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ బర్త్ డే విషెస్‌తో చాలా ఆనందంగా ఉన్నానని తెలిపిన చరణ్…. ఇంత మంది ప్రేమను పొందేందుకు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నానని తెలిపాడు. కానీ నేను మీ నుంచి జన్మదిన కానుక కోరుకుంటున్నానని… వేడుకలకు దూరంగా ఉంటూ మీరు ఇంట్లో ఉండడమే నాకు బెస్ట్ గిఫ్ట్ అని తెలిపాడు. దీంతో తమ అభిమాన హీరో కోరుకున్నట్లుగానే వేడుకలు జరుపలేదు మెగా ఫ్యాన్స్.

కరోనా ఎఫెక్ట్‌తో బర్త్ డే గ్రాండ్‌గా జరుపుకోలేక పోయిన చరణ్… ఇంట్లో సింపుల్‌గా కేక్ కట్ చేశాడు. తన భార్య ఉపాసన ఇచ్చిన సర్ ప్రైజ్ ఎంజాయ్ చేశాడు. చెర్రీతో కేక్ కట్ చేయించిన ఉపాసన.. తనకు ముద్దు పెట్టి మరీ విష్ చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పాటుగా చెర్రీ ఫ్యాన్స్ బర్త్ డే సందర్భంగా తయారు చేసిన స్పెషల్ వీడియో ట్రెండ్ అయింది. ఫుల్ క్యాచీగా ఉన్న ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Tags : Ram Charan Teja, Upasana, BIRTHDAY, Celebration

Advertisement

Next Story

Most Viewed