- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రకుల్ 15 మిలియన్ల సంతోషం
‘ఐ వన్నా.. ఫాలో ఫాలో యూ’ అంటూ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో తారక్.. రకుల్ వెంటపడ్డ విషయం తెలిసిందే. వాస్తవానికి కూడా ఆ మాటలు.. హీరోయిన్ రకుల్‌కు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్‌ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 15 మిలియన్లు చేరుకోగా.. ఈ విషయంలో స్టార్ హీరోలను కూడా మించి పోయింది అమ్మడు. ఇక తమ అభిమాన నటి ఈ ఘనత సాధించడంతో.. రకుల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రకుల్‌కు సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేశ్‌ల కంటే రకుల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ఢిల్లీ బ్యూటీ.. 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను చేరుకోవడంతో.. అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ‘సోషల్ మీడియా, స్కిల్స్, నా పని.. వీటిలో దేనిపైనా నాకు సరైన నాలెడ్జ్ లేదు. కానీ మీరందరూ నాకు మద్దతునిస్తూ.. నాపై అమితమైన ప్రేమను కురిపించారు. దాని కోసం నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉన్నాను. నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు.. కానీ మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరింత హార్డ్ వర్క్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. నా ఇన్‌స్టా ఫ్యామిలీ మెంబర్స్‌కు ఓ బిగ్ హగ్ ఇస్తున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి కారణం మీరే. మిలియన్ల నవ్వుల్ని, సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను లవ్ యూ ఆల్’ అని రకుల్ పేర్కొంది. ఇక రకుల్ అటు స్టార్ హీరోలతో.. ఇటు కుర్ర హీరోలతోనూ సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. సౌత్‌లోనూ, బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంటోంది.
https://www.instagram.com/p/CDfiyG9h169/