- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాకాహారం ట్రై చేయండి: రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. డైలీ ఎక్సర్సైజ్, యోగా చేయడంతో పాటు .. ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కాగా తాజాగా జంతువుల హక్కుల కోసం పోరాడే స్వచ్చంధ సంస్థ పెటా ఇండియాకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న రకుల్… ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శాకాహారులుగా మారిపోవాలని అభిమానులకు సూచిస్తుంది. ఈ క్రమంలోనే శాకాహారం ట్రై చేయండి.. అది మిమ్మల్ని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది అనే అర్థాన్నిచ్చేలా ఓ ఫొటో కూడా షేర్ చేసింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ శివంగి కులకర్ణి క్లిక్ చేసిన ఈ ఫొటో కొంచెం బోల్డ్‌గానే ఉండగా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో శాఖాహారిగా మారిన రకుల్ ఇది నా లైఫ్‌లోనే గొప్ప నిర్ణయం అంటోంది. అంతేకాదు వెజిటేరియన్‌గా మారిన తర్వాత ఆరోగ్యపరంగా చాలా అద్భుతాలు చూశానని చెప్తుంది రకుల్.
కాగా సినీ స్టార్స్ అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, మాధవన్, షాహిద్ కపూర్, హేమ మాలిని ఇప్పటికే పెటా సంస్థతో చేతులు కలపగా .. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంస్థకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.