మకాం మార్చిన రకుల్.. కారణం అదేనట!

by Anukaran |   ( Updated:2020-07-14 10:05:32.0  )
మకాం మార్చిన రకుల్.. కారణం అదేనట!
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ విలయతాండవం చేస్తోంది. దీంతో ముంబైలో నివాసం ఉంటున్న ప్రముఖులు, సినీ తారలు అందరూ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెలుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ముంబై నుంచి హైదరాబాద్‌కు షిష్ట్ అయ్యింది. అంతేగాకుండా రకుల్ ప్రీత్ సింగ్‌కు హైదరాబాద్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడే ఆమె బిజినెస్ కూడా ఉంది. ఎఫ్ 45 పేరుతో ఇప్పటికే రకుల్ మొదలు పెట్టిన జిమ్ బిజినెస్ బ్లాక్‌బస్టర్ అయింది కూడా. ఇక్కడే కాదు విజయవాడ లాంటి నగరాల్లో కూడా రకుల్‌కు జిమ్ సెంటర్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌కి ముందు రకుల్ ముంబై వెళ్ళింది. అప్పటినుంచి ఇప్పటివరకూ అక్కడే ఉంది. సడలింపుల తర్వాత కూడా ముంబై దాటి రాలేదు. తమ్ముడు అమన్ ప్రీత్‌తో కలిసి అక్కడే ఉంటుంది. లాక్‌డౌన్ మూడు నెలలు ఇద్దరూ కలిసే, వండుకుని తిన్నారు.. ఆడుకున్నారు.. ఆ విషయాలన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పటికప్పుడూ అప్డేట్ ఇస్తోంది కూడా. ఆ తర్వాత ఢిల్లీలోని తమ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ బయటికి రావడం మొదలు పెట్టింది రకుల్. ఆ మధ్య షూటింగ్ కోసం కొన్నిరోజులు బయటికి వచ్చింది రకుల్. ఆ తర్వాత మళ్లీ ఇంటికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చింది రకుల్. ఆమెతో పాటు తమ్ముడు అమన్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఆమెకు సొంతంగా ఇల్లు ఉంది. జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్ సమీపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గర్లోనే రకుల్ ప్రీత్ సొంత ఫ్లాట్ తీసుకుంది. ప్రస్తుతం అక్కడే ఉంది ఈ ముద్దుగుమ్మ. ముంబైలో కరోనా మహమ్మారి తీవ్రంగా ఉండటంతో ఇక్కడికి ఈ ముద్దుగుమ్మలు వచ్చేస్తున్నారు.

Advertisement

Next Story