- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గార్జియస్ రకుల్.. బ్యూటిఫుల్ జర్నీ
దిశ, వెబ్‌డెస్క్ : అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తయ్యాయి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన గార్జియస్ రకుల్.. తన బ్యూటిఫుల్ జర్నీలో చాలెంజింగ్ రోల్స్‌లోనూ నటించి మెప్పించింది. గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేయడంలోనూ బెస్ట్ అనిపించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది.
ఈ సందర్భంగా స్పెషల్ పోస్టు ద్వారా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన రకుల్.. తెలుగు ఇండస్ట్రీలో తన ప్రయాణం నవ్వులతో సాగిందని, అప్పుడు ఇప్పుడు తన నవ్వు వెనుకున్న ప్రధాన కారణం తెలుగు ప్రజలు తనను ప్రేమతో యాక్సెప్ట్ చేయడమే అని చెప్పింది. ఢిల్లీ గర్ల్ నుంచి పక్కా తెలుగమ్మాయిగా తన ప్రయాణం చాలా అందంగా ఉందన్న రకుల్.. తనను నమ్మిన ప్రతీ దర్శకుడు, నిర్మాత, సహ నటులు, మిత్రులకు ధన్యవాదాలు తెలిపింది. తనను అప్రిషియేట్ చేస్తూనో, క్రిటిసైజ్ చేస్తూనో తనలో బెస్ట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పింది. తన ఫ్యామిలీ, మేనేజర్, టీమ్ లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదని, వారికి రుణపడి ఉంటానంది రకుల్.