- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థియరీస్ నమ్మను.. కొంచెం డిజప్పాయింట్‌తో ఉన్నా : రకుల్
దిశ, సినిమా: హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ లాక్‌డౌన్‌లోనూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసింది. ‘సర్దార్ కా గ్రాండ్సన్’ సినిమాతో హిట్ అందుకున్న రకుల్.. బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్ట్‌లు కమిట్ అయినట్లు సమాచారం. బీటౌన్‌లో గుర్తింపు తెచ్చుకునేందుకు ఏడేళ్లు కష్టపడిన నటి.. ఔట్ సైడర్ కావడం వల్లే ఇలా జరిగిందా అంటే కాదని చెప్తోంది. తానెప్పుడూ ఇన్‌సైడర్ -ఔట్‌సైడర్ థియరీస్ నమ్మనని చెబుతూ.. ఈ డిబేట్ రీసెంట్‌గానే స్టార్ట్ అయిందని అంటోంది.
టాలెంట్, హార్డ్‌వర్క్ మాత్రమే లాంగ్ లాస్టింగ్ కెరియర్‌కు సహాయపడుతుందని నమ్ముతున్నానని, ఒక యాక్టర్‌ను ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాక కాంటాక్ట్స్ పెంచుకుంటూ ఆపర్చునిటీస్ పొందాలే తప్పా ఇన్‌సైడర్ – ఔట్‌సైడర్ అని మాట్లాడకూడదని అభిప్రాయపడింది. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? లేక రిజెక్ట్ చేస్తారా? అనేదానితో మన కెరియర్ ముడిపడి ఉంటుందన్న రకుల్.. కరోనా కారణంగా గతేడాది తన సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నా కాలేదని, ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయన్న రకుల్.. ఇది కొంచెం డిజప్పాయింట్ కలిగించే విషయమైనా సరే తాను పాజిటివ్‌గానే ఉన్నట్లు చెప్పింది. ఇక థియాట్రికల్ రిలీజ్‌లు లేవని బాధపడే కన్నా ఓటీటీ ద్వారా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నామనే తృప్తి ఉందంటోంది రకుల్.