సైక్లింగ్‌లో టాలీవుడ్‌ తారలు..

by Shyam |
సైక్లింగ్‌లో టాలీవుడ్‌ తారలు..
X

రకుల్‌ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ ప్రసన్న బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. రెస్టారెంట్స్‌కు వెళ్తుండటంతో పాటు ఇంట్లో పార్టీలు చేసుకుని మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్‌గా వీళ్లిద్దరూ కలిసి సైక్లింగ్ చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని సుచిత్ర సర్కిల్ నుంచి తూప్రాన్ వైపు 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. సైక్లిస్ట్ ఆదిత్య మెహతా అండ్ టీమ్‌తో కలిసి సైక్లింగ్ చేసిన ఈ ఇద్దరూ.. ఇంత గొప్ప అనుభవాన్ని ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. కాగా లక్ష్మీ, రకుల్ ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌లా చేశారని.. అమేజింగ్ ఉమెన్స్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆదిత్య.

ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఇద్దరూ.. త్వరలో 100 కిలోమీటర్ల సైక్లింగ్ కూడా పూర్తి చేస్తామన్నారు. అమేజింగ్ ఫ్రెండ్ రకుల్.. తనతో అన్ని ఈవెంట్స్‌లో పాల్గొంటుందని చెప్తూ పోస్ట్ పెట్టింది లక్ష్మీ. కాగా, ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story