‘మేడే’ సెట్‌లో రకుల్..

by Shyam |
‘మేడే’ సెట్‌లో రకుల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ హ్యాపీగా జరుపుకుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ కెమెరా ముందుకొచ్చేందుకు సిద్ధమైన పంజాబీ భామ.. బాలీవుడ్ ప్రాజెక్ట్‌ కోసం ముంబై వెళ్లింది. ఈ మేరకు తన ఫస్ట్ డే షూటింగ్ గ్లింప్స్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది రకుల్.

‘మేడే.. హ్యాపీయెస్ట్ వర్క్’ అంటూ షూటింగ్ కోసం మేకప్ వేసుకుంటున్న బూమరాంగ్ వీడియోను షేర్ చేసిందది. కాగా అజయ్ దేవ‌గణ్, అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేరింగ్ చేసుకోవడానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు రకుల్ ఇదివరకు చెప్పిన విషయం తెలిసిందే. అజయ్ దేవగణ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘మే డే’ సినిమా.. ఏప్రిల్ 29, 2022న విడుదల కానుండగా, ఈ ఇద్దరు ఇదివరకు ‘దే దే ప్యార్ దే’లో కలిసి నటించారు. ఇక బాలీవుడ్‌లో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటించిన ‘షిమ్లా మిర్చి’లో చివరిసారి కనిపించిన రకుల్.. ప్రస్తుతం మేడే చిత్రంతో పాటు జాన్ అబ్రహంతో కలిసి ‘అటాక్’, అర్జున్ కపూర్‌తో మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న రకుల్.. బీటౌన్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.

Advertisement

Next Story