మోడీకి పాకిస్థాన్ మహిళ రాఖీ

by Anukaran |
మోడీకి పాకిస్థాన్ మహిళ రాఖీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈసారి కూడా పాకిస్థాన్ కు చెందిన మహిళ కమర్ మొహిసిన్ షేక్ రాఖీ పంపింది. మోడీ ఆయురారోగ్యలతో వందేళ్లు జీవించాలని దేవుడిని కోరుకుంటూ ఆ రాఖీ పంపినట్లు ఆమె పేర్కొన్నది. పట్టుదల, శ్రమతో మోడీ ప్రధానమంత్రి వరకు ఎదిగారంటూ ప్రశంసించింది.

తనకే కాదు.. తన భర్తు మొహిసిన, కుమారుడు సుఫీయాన్ కు కూడా మోడీ అంటే ప్రత్యేక అభిమానమని తెలిపింది. తాను మోడీకి గత 25 ఏళ్ల నుంచి రాఖీ పంపుతున్నట్లు పేర్కొన్నది. మోడీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్లి కలుస్తానని ఆమె చెప్పుకొచ్చింది. కాగా, పాకిస్థాన్ కు చెందిన కమర్.. భారత్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఏళ్ల నుంచి ఆమె ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం వారు అహ్మదాబాద్ లోనే ఉంటున్నారు.

Advertisement

Next Story