- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్సీ నుంచి పెద్దల సభకు.. కవితకు కేసీఆర్ ప్రమోషన్?
దిశ, వెబ్ డెస్క్: టీఆర్‌ఎస్‌లో పదవుల పందేరం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో మొదలైన ఈ పదవుల పండుగ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న నామినేటెడ్ పదవుల భర్తీ వరకు కొనసాగనుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ పదవుల పోటీ మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వగా.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కోసం నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆశావహులు భారీ సంఖ్యలో ఉండటంతో నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుందనేది చివరి నిమిషం వరకు ఉత్కంఠగా మారనుంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కూడా చివరి నిమిషం వరకు సస్పెన్స్ గా మారింది. వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్, సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేర్లు చివరి నిమిషంలో అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. దీంతో టికెట్ ఆశించిన ఆశావాహులు భంగపడ్డారు. బండా ప్రకాష్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారు కావడంతో రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
అయితే చివరి నిమిషంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం కొత్త చర్చకు దారి తీసింది. దీని వెనుక బలమైన కారణం వినిపిస్తోంది. తన కూతురు కల్వకుంట్ల కవితకు రాజ్యసభ పదవి ఇవ్వడం కోసమే బండా ప్రకాష్‌కు ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్‌లోకి తీసుకునే అవకాశముందనే వార్తలు జోరందుకున్నాయి. కవిత మొన్నటివరకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆమె పదవీకాలం ఇటీవల ముగిసింది. మరోసారి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఆమెను రెన్యూవల్ చేసే అవకాశముందనే వార్తలు వినిపించాయి.
కానీ అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజ్యసభ సభ్యుడిగా బండా ప్రకాష్‌కు మరో మూడేళ్ల పదవీకాలం ఉంది. ఇప్పుడు ఆయన స్థానంలో కవితను రాజ్యసభకు పంపే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్లకు సాధారణ ఎన్నికలు రానున్నాయి. అప్పటివరకు కవిత రాజ్యసభ ఎంపీగా కొనసాగి.. వచ్చే ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేసే అవకాశముందనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి కవిత పెద్దల సభకు వెళుతుందా..? లేదా అనేది చూడాలి.