వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

by Anukaran |
వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆదివారం ఆమోద ముద్ర వేసింది. విపక్షాల ఆందోళన మధ్యే మూజువాణి ఓటుతో బిల్లులు పాసైనట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించి.. సభను రేపటికి వాయిదా వేశారు. సభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బిల్లులు ప్రవేశపెట్టిన సమయంలో విపక్షాలు ఆందోళనకు దిగగా వ్యవసాయ సంస్కరణల ఫలితంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఈ బిల్లులు రైతులకు నష్టం చేకూరుస్తాయని, వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రెయిన్ వెల్‌లోకి దూసుకెళ్లి రూల్ బుక్ ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడటంతో డిప్యూటీ ఛైర్మన్ సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాల మధ్యే బిల్లులకు ఆమోదం లభించింది.

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్‌తో పాటు టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్‌ సభ్యులు వ్యతిరేకించగా వైసీపీ ఎంపీలు సమర్థించారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed