- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభ, లోక్ సభ టీవీలు విలీనం
దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ, లోక్ సభ టీవీలను కలిపి సంసద్ టీవీగా రేపటి నుంచి ప్రసారాలను ప్రారంభించనున్నారు. 1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో జరిగిన మొదటి ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగి నూరేళ్లు అయిన సందర్భంగా బుధవారం 81వ ఆల్ ఇండియా అసెంబ్లీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ల సమావేశం నిర్వహిస్తున్నారు. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్‌లో లోక్ సభ స్పీకర్ అధ్యక్ష హోదాలో పాల్గొంటారు. అదే విధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మరియు దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, 6 రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్లు కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు.
తెలంగాణ నుంచి శాసనసభ భవనంలో ఏర్పాటు చేసిన వర్చువల్ పద్ధతిలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొంటారని లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.