భారత్‌ను ఆయుధాల ఎగుమతుల దేశంగా మార్చాలి.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

by Shamantha N |
rajnath singh
X

దిశ, కంది: దేశాన్ని ప్రస్తుతం ఆయుధాల దిగుమతి నుంచి ఎగుమతి కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఓడిఎఫ్ ఆయుధ కర్మాగార కేంద్రంలో ‘అజాది కా అమృత్’ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఓడిఎఫ్ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వర్చువల్ వీడియో కాలింగ్ ద్వారా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రక్షణ రంగలో ఓడిఎఫ్ పాత్ర కీలకంగా పని చేస్తుందని వివరించారు. దేశంలో మొత్తం 141 కేంద్రాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు. 75వ స్వాతంత్ర వారోత్సవాలలో భాగంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఓడిఎఫ్ తయారుచేసిన యుద్ధ బ్యాంకులు ఇతర వస్తువులను ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచడం మంచి విషయం అన్నారు.

అనంతరం హైదరాబాద్ ఐఐటి డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ.. దేశ రక్షణ రంగంలో కీలకంగా పనిచేస్తున్న ఆయుధ కర్మాగారం కేంద్రానికి తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం వాహనాల ఎగ్జిబిషన్, ఇతర ఫోటో ఎగ్జిబిషన్‌లో స్థానిక ప్రజలు పాల్గొని యుద్ధ ట్యాంక్‌ల ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీ దిగి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ ఏజీఎం ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed