ముంబై ఫేవరెట్‌గా.. రజనీ స్టైల్ దోశ

by Sujitha Rachapalli |   ( Updated:2023-03-28 16:57:53.0  )
ముంబై ఫేవరెట్‌గా.. రజనీ స్టైల్ దోశ
X

దిశ, ఫీచర్స్ : సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌ లిస్టులో ‘దోశ’కు తప్పక స్థానం ఉంటుంది. దోశ బాగుందన్న టాక్ వస్తే చాలు.. అది రోడ్ సైడ్ హోటల్ అయినా సరే, ఫుడ్ లవర్స్ అక్కడ క్యూ కడుతుంటారు. అయితే టేస్టే కాదు, పెనం మీద దోశ వేయడం కూడా యూనిక్ స్టైల్‌లో ఉంటే ఇంకా బాగుంటుంది కదా! ఓ పక్క దోశ తింటూనే, ఆ మేకింగ్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అలా యూనిక్ అండ్ క్రియేటివ్‌ స్టైల్‌లో దోశలు వేస్తూ ఫుడ్ లవర్స్‌‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని ముత్తు అన్న. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుందంటే..

ముంబై సిటీలోని దాదర్‌కు చెందిన ముత్తు అన్న.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమాని. ఆయన సినిమా విడుదలైతే పండగ చేసుకుంటాడు. కాగా బతుకుదెరువు కోసం ‘ముత్తు దోశ కార్నర్’ పేరిట హోటల్ ప్రారంభించిన ముత్తు.. 30 ఏళ్లుగా యూనిక్ స్టైల్‌లో దోశలు చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నాడు. పంచె కట్టులో.. దోశ మేకింగ్, కట్టింగ్, ప్లాంటింగ్, స్లైడింగ్ అన్నిట్లోనూ యూనిక్ స్టైల్‌ను ఫాలో అవుతుంటాడు. అయితే తన దోశ మేకింగ్‌ను వీడియో తీసిన కస్టమర్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. రజనీకాంత్ మాదిరి ఈయనది కూడా ఓ యూనిక్ స్టైల్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

తాను ఇలా యూనిక్ స్టైల్‌లో దోశ తయారు చేస్తూ.. సర్వ్ చేయడానికి తన అభిమాన హీరో ‘తలైవా’నే కారణమని, రజనీని చూడటం ద్వారానే తనకు ఈ స్టైల్ మేకింగ్ సెన్స్ వచ్చిందని ముత్తు తెలిపాడు. కాగా, రజనీ నటించిన ‘ముత్తు’ చిత్రం పేరును తన దోశ సెంటర్‌కు పెట్టుకుని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతుండటం విశేషం.

Advertisement

Next Story