ప్రధానికి రజనీ థాంక్స్.. సెలబ్రేషన్ మోడ్‌లో ఫ్యాన్స్

by Jakkula Samataha |
ప్రధానికి రజనీ థాంక్స్.. సెలబ్రేషన్ మోడ్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా : సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు(గురువారం) ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. రజనీకి ఈ అవార్డు దక్కడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తుండగా.. ఆయన ఫ్యాన్స్ ఈ శుభ సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశ ప్రధాని మోడీ కూడా రజనీకి శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఈ మేరకు స్పందించిన రజనీ.. తనను ప్రెస్టీజియస్ అవార్డుతో సత్కరించినందుకు ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి థాంక్స్ చెప్పారు. ఈ అవార్డును తన జర్నీలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికి డెడికేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంత గొప్ప అవకాశాన్నిచ్చిన దేవుడికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు జ్యూరీ కమిటీలో సింగర్ ఆశాభోంస్లే, గాయకుడు శంకర్ మహదేవన్, మోహన్ లాల్, బిశ్వజీత్, సుభాష్ ఘాయ్ సభ్యులుగా ఉన్నారు. 2019కి గాను రజనీని దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక చేసింది ఈ జ్యూరీ పానెల్ సభ్యులే. అయితే మరికొద్ది రోజుల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రజనీకి ఈ అవార్డు ప్రకటించారని విపక్షాలు విమర్శలు చేస్తుండటం గమనార్హం.

https://twitter.com/rajinikanth/status/1377531383531200519?s=20

Advertisement

Next Story