రజినీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన.. ఈసారి అమెరికాలో

by Shyam |   ( Updated:2021-06-14 23:54:00.0  )
rajinikanth health
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్స్ లో రజినీ ఎప్పుడూ వైద్యుల సంరక్షణలోనే ఉంటారు. ఇక తాజాగా ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రజినీ అమెరికాకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టడం కొంత చర్చనీయాంశమైంది.

రజినీ ఎప్పటికప్పుడు అమెరికాలో జనరల్ బాడీ చెకప్ చేయించుకుంటారన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సమయంలో కూడా జనరల్ చెకప్ కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన మనవిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించి అమెరికాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇటీవలే ప్రత్యేక విమానంలో తన కుటుంబసభ్యులతో కలసి రజనీ అమెరికా వెళ్లారట. ఈ విమానంలో పద్నాలుగు మంది వరకూ ప్రయాణించవచ్చట. దీంతో రజినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలైవా ఆరోగ్యం బావుండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed