బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్

by Shyam |   ( Updated:2020-10-17 06:35:02.0  )
బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 33వ మ్యాచ్ ప్రారంభంకానుంది. 33వ మ్యాచ్‌‌లో రాజస్తాన్ రాయల్స్ వర్సెస్‌ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన రాజస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.

జట్ల బలాబలాలు:

ఇక ఆర్సీబీ జట్టును చూస్తే బ్యాటింగ్ లైనప్‌ బలంగానే ఉంది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్ ఒక మ్యాచ్‌ కాకపోయిన మరో మ్యాచ్‌లో రాణిస్తున్నారు. ఇక కెప్టెన్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఫామ్ కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు సుందర్, శివం దూబే రాణిస్తున్న మరింతగా బ్యాటింగ్ ఆడాల్సి ఉంది. బౌలింగ్ విషయానికొస్తే యూజువేంద్ర చాహల్ తన స్పిన్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పుతున్నాడు. క్రిస్ మోరిస్, ఇసురు ఉదాన, నవదీప్ సైని వంటి బౌలర్లు చక్కగా రాణిస్తున్నారు. మొత్తానికి రాయల్ చాలెంజర్స్‌ జట్టులో కీలక ఆటగాళ్లతోనే నిండి ఉందనే చెప్పాలి. దీంతో ఇప్పటికే 8 మ్యాచులు ఆడిన బెంగళూరు 5 ఇన్సింగ్స్‌లో విజయం సాధించింది. మూడింట్లో ఓటమి చెందింది.

రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఆటగాళ్లను చూస్తే బలంగా కనిపించినా.. వారి సామర్థ్యలకు తగ్గట్టు ఆడలేకపోతున్నారు. ఒక్క వికెట్ పడితే అదే కొనసాగుతుంది. ఆడితే అందరూ ఆటగాళ్లు చెలరేగుతున్నారు. ఇక కొత్తగా టీంలోకి వచ్చిన ప్రమాదకర బ్యాట్స్‌మెన్ బెన్‌ స్టోక్స్‌ ఒక మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసినా.. మొన్నటి ఢిల్లీ మ్యాచ్‌లో (41) పరుగులు చేశాడు. దీంతో ఈ రోజు మ్యాచ్‌లో ఫామ్ కొనసాగించే అవకాశం ఉంది.

అయితే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, యశస్వి జైశ్వాల్‌, ఉతప్ప, రాహుల్ తెవాతియా వంటి ఆటగాళ్లతో టాప్ ఆర్డర్ భయాంకరంగా ఉంది. అయినా.. ఇందులో ఆటగాళ్లు ఒత్తికి లోనవడంతో మంచి స్కోర్ చేయలేకపోతున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే వరల్డ్ ఫేమస్ బౌలర్ ఆర్చర్ బాగా రాణిస్తున్నాడు. ఇతనికి తోడు కార్తీక్ త్యాగి, ఉనాద్కట్, టామ్ కుర్రాన్ మరింత కసరత్తులు చేయాల్సి ఉంది. రాజస్తాన్ జట్టు చూడటానికి బలంగా కనిపించిన ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడి కేవలం 3 మ్యాచుల్లోనే విజయం సాధించింది. 5 మ్యాచుల్లో ఓటమి పాలు అయింది. ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్ఆర్ ఏ స్థాయిలో స్కోర్ నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story