భార్యను చంపి.. వీడియో గేమ్ ఆడుతూ!

by Sumithra |   ( Updated:2020-12-08 04:29:15.0  )
భార్యను చంపి.. వీడియో గేమ్ ఆడుతూ!
X

దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. అనంతరం మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని మొబైల్‌లో వీడియో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. బీజేఎస్ కాలనీకి చెందిన విక్రమ్ సింగ్, శివ కన్వర్ దంపతులు. విక్రమ్‌ జూలాయిగా తిరుగుతూ ఉండేవాడు. శివ కన్వర్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో సోమవారం భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపం పట్టలేని విక్రమ్‌ సింగ్‌ ఇంట్లోని కత్తెరతో విచక్షణారహితంగా హత్య చేశాడు. అనంతరం అత్తమామలతో పాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి భార్య రక్తపు మడుగుల్లో పడి ఉండగా.. మృతదేహం పక్కనే విక్రమ్ వీడియో గేమ్‌ అడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య జరిగిన సమయంలో వారు ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story