- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
28న రాజస్తాన్ క్యాబినెట్ విస్తరణ..?
జైపూర్: పంజాబ్‌లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూల మధ్య వైరం చక్కబెట్టిన కాంగ్రెస్ హైకమండ్ ఇప్పుడు రాజస్తాన్‌పైకి ఫోకస్ షిఫ్ట్ చేసింది. రాజస్తాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల ఏడాది కాలం నాటి బేధాభిప్రాయాలకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే రాజస్తాన్ మంత్రివర్గ మండలిని విస్తరించనున్నది. ఈ నెల 28న మార్పులు చేర్పులు ఉండనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ(ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, రాజస్తాన్ వ్యవహారాల ఇంచార్జీ అజయ్ మాకెన్‌లు ఆదివారం రాష్ట్ర ఎమ్మెల్యేలు, పీసీసీ సభ్యులతో సమావేశమయ్యారు.
క్యాబినెట్ విస్తరణపై శనివారమే సీఎం అశోక్ గెహ్లాట్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గంలో మార్పుచేర్పులపై నిర్ణయాలను అధిష్టానం అభీష్టానికే వదిలిపెట్టినట్టు సమాచారం. 18 ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ సీఎం గెహ్లాట్‌పై తిరుగుబాటు చేసిన ఏడాది గడిచింది. కాంగ్రెస్ హైకమండ్ హామీలతో వెనక్కి తగ్గారు. ఆ హామీలను కాంగ్రెస్ ఇంకా అమలు చేయలేదని, సచిన్ సహా ఆయన శిబిరం ఎమ్మె్ల్యేలు ఇటీవలే లేవదీశారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలో సచిన్ వర్గీయులకు చోటు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తున్నది. ప్రస్తుతం రాజస్తా్న్ క్యాబినెట్‌లో సీఎం సహా మొత్తం 21 మంది సభ్యులున్నారు. మరో తొమ్మిది మందిని తీసుకునే వెసులుబాటూ ఉన్నది.