రూటు మార్చిన రాజశేఖర్.. ఓల్డేజ్ లుక్‌తో సర్‌ప్రైజ్

by Shyam |   ( Updated:2023-08-18 16:13:32.0  )
రూటు మార్చిన రాజశేఖర్.. ఓల్డేజ్ లుక్‌తో సర్‌ప్రైజ్
X

దిశ, సినిమా: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. లలిత్ దర్శకత్వంలో 91వ సినిమా షూటింగ్ తాజాగా స్టార్ట్ అయింది. ‘శేఖర్ – మ్యాన్ విత్ ద స్కార్’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ ఇంట్రెస్టింగ్‌ అండ్ యూనిక్‌గా ఉండగా.. ఎంఎల్‌వీ సత్యనారాయణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు థాంక్‌ఫుల్ నోట్ సెండ్ చేశారు రాజశేఖర్. ‘అతి భయంకరమైన కరోనా, నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకెళ్లినా.. మీ ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన నిరంతర ప్రార్థనలు నన్ను మళ్ళీ ఈ పుట్టినరోజున ఒక కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించే స్థితికి తీసుకొచ్చాయి. కనిపించని ఆ దేవుడికి, కనిపించే దేవుళ్లైన మీకు సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను’ అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు రాజశేఖర్.

Advertisement

Next Story

Most Viewed