రాజమౌళి భారీ ఆఫర్.. ఆశ్చర్యపోయిన అలియా భట్

by Shyam |   ( Updated:2021-12-10 01:38:46.0  )
rajamouli-1
X

దిశ, వెబ్ డెస్క్: సినిమాల్లో నటిస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ అలియా భట్ గురించి మళ్లీ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి, అలియా భట్ మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రస్తావనకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆర్ఆర్ఆర్ మూవీలో సీత పాత్రను కైవసం చేసుకున్న విధానాన్ని వివరించింది. ‘నేను రాజమౌళి సార్‌ను హైదరాబాద్ విమానాశ్రయంలో కలిశాను. వెంటనే సార్ తో చెప్పాను. సార్ నాకు మీ చిత్రంలో పని చేయాలని ఉంది … నేను ‘మీ సినిమాలో నటించేందుకు ఏమైనా చేస్తాను అని అన్నాను. నాకు ఆశ్చర్యం కలిగించేలా సీత పాత్రను అప్పగించారు. అయితే, ఈ విషయంపై రాజమౌళి సార్ మాట్లాడుతూ.. సినిమాలో సీత చాలా ముఖ్యమైనది, మీరు ఆమె పాత్రతో సరిపోలినందుకు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పారు’ అని అలియా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed