రాంగ్ ఫేషియల్ ట్రీట్మెంట్‌.. మాడిపోయిన హీరోయిన్ ఫేస్

by Anukaran |   ( Updated:2021-04-19 01:11:36.0  )
Raiza Wilson
X

దిశ, సినిమా: కథానాయికలకు తమ అందమే విలువైన ఆస్తి. గ్లామర్ ఉన్నంత కాలమే ఈ ఫీల్డ్‌లో రాణించగలరు. అదే సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారి కెరియర్ ముగిసినట్లే. తమిళ్ హీరోయిన్ రైజా విల్సన్‌‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. సింపుల్ ఫేషియల్ ట్రీట్మెంట్ కోసం డెర్మటాలజిస్ట్ డాక్టర్ భైరవి సెంథిల్‌(Dr. B – The Acne Lab, Chennai) దగ్గరకు వెళ్తే.. తనకు ఇష్టం లేకపోయినా, ఈ సారి కొత్తగా ట్రై చేద్దామని ఫోర్స్ చేసి మరీ అవసరం లేని ట్రీట్మెంట్ ఇచ్చిందని చెప్పింది. అయితే ఈ ప్రొసీజర్ ముగిశాక తన మొహం పూర్తిగా మాడిపోయిందని, కన్ను కింద స్వెల్లింగ్ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది. మళ్లీ డాక్టర్‌ దగ్గరకు వెళ్తే తనతో మాట్లాడేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదని, తను సిటీలోనే లేదని స్టాఫ్ చెప్తున్నారని వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్టోరీ షేర్ చేశాక.. డాక్టర్ భైరవి దగ్గర సేమ్ ప్రాబ్లమ్ ఎదుర్కొన్న వారితో తన మెసేజ్ బాక్స్ నిండిపోయిందని తెలిపింది రైజా.

Advertisement

Next Story