- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలుగు రాష్ట్రాలకు మూడు రోజులు తిప్పలు
by Anukaran |
X
దిశ, ఏపీ బ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిన ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, 11వ తేదీ సాయంత్రంలోపు ఏపీ తీరాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Advertisement
Next Story