- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
11 ఏళ్ల కింద అచ్చం ఇలాగే జరిగిందంట
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్/మెదక్ : ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో వాన ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో ప్రాజెక్టులు నిండగా, పలు చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు నీటిని కిందికి వదులుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా రాకొండ గ్రామంలో మిద్దె కూలడంతో తల్లీ, కూతురు మృతి చెందారు. వంగూర్, ఉప్పునుంతల మండలాల మధ్య దుందుభి వాగు స్థాయికి మించి ప్రవహిస్తోంది. అటుగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై చిక్కుకుపోయింది. హుస్నాబాద్ పరిధిలోని బస్వాపూర్ వాగులో గల్లంతైన లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో 2.5 మిల్లీ మీటర్లు, మెదక్‌లో 26.16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన నాలుగు రోజులుగా కురుస్తున్న ఏడతెరిపి లేని వర్షం కారణంగా ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటలో ఉమ్మడి మహబూబ్‌నగర్ లో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టు 13 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో 31 అడుగులకు నీరు చేరడంతో 6 గేట్లు తెరిచి 3,500 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. భీమా నర్సిరెడ్డి రిజర్వాయర్‌లోని 4 గేట్లు ఎత్తి 1700 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సుమారు 11 సంవత్సరాల తరువాత సరళాసాగర్ సైఫాన్లు తెరుచుకున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఉన్న 6846 చెరువులు, కుంటల్లోకి నీరు భారీగా చేరడంలో అవి అలుగులు పారుతున్నాయి. దీని వల్ల చాలా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. పలుచోట్ల కాల్వర్టులపై నుంచి నీరు పారుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంతరాయం లేకుండా వాన కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పాత ఇండ్లు కూలిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోటకదిర గ్రామంలో మూడు ఇండ్లు కూలిపోయాయి. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎవరూ నదిలోకి వెళ్లకూడదని ఆదేశించారు. పాత ఇండ్లను గుర్తించి వెంటనే వాటిని ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు, రెవెన్యూ, వైద్య ఇతర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
బెజ్జంకి, కోహెడ మండలాల్లో కురుస్తున్న భారీ వర్షానికి చెరువులు కుంటలు నిండాయి. కోహెడ బెజ్జంకి మండలంలోని మోయతుమ్మెద వాగు వరద నీళ్లతో ఉధృతంగా ప్రవహిస్తుంది. రహదారులపై నీరు ప్రవహించడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జంకి మండలంలోని తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మత్తడి దూకుతుంది. హుస్నాబాద్‌లోని బస్వాపూర్ వాగులో శనివారం కొట్టుకుపోయిన లారీ డ్రైవర్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతని ఆచూకీ కనుగొనేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారి నుంచి బెజ్జంకి మండల కేంద్రానికి వెళ్లే రహదారిలో ఈదుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించాయి. దాచారం అనుబంధ గ్రామం లద్దబండ గ్రామం తోటపల్లి ఆన్‌లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బ్యాక్ వాటర్ పెరగడంతో ఇండ్లలోకి నీరు చేరాయి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్‌లో అర్ధరాత్రి నీటి ప్రవాహానికి పలు ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లోని వస్తువులు, వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వరద ప్రవాహానికి రహదారులకు గండ్లు పడ్డాయి. హుస్నాబాద్ మండలంలోని మహాగండి సముద్రం 55 ఏండ్ల తర్వాత నిండి ముత్తడి పోస్తున్నది. చిన్నకోడూర్ మండలం చర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ, బీసీ కాలనీలో కొన్ని ఇండ్లు కూలిపోయాయి. దీంతో బాధిత 6 కుటుంబాలకు ప్రాథమిక పాఠశాల, ముదిరాజ్, మహిళా సంఘం కార్యాలయంలో పునరావాసం కల్పించారు. జిల్లాలో 80 శాతం మేర చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 26.16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలో ఆదివారం 38.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సంగారెడ్డి జిల్లాలో 19.8 మిల్లీమీటర్లు, మెదక్ జిల్లాలో 19.9 మిల్లీమీటర్లు నమోదైంది.