- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హరీశ్‌రావు మాట లెక్కలేదంట
దిశ, హుస్నాబాద్: గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్డు ప్రాంతమంతా జలదిగ్భంధమైంది. దీంతో పలు ఇళ్లతోపాటు కిరాణ షాపులు, బట్టల దుకాణాల్లోకి నీరు చేరడంతో అత్యధికంగా నష్టం వాటిల్లిందని పలువురు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికను తీసి డ్రైనేజీలను క్లీన్ చేయించాలని మున్సిపల్ శాఖ, పాలకమండలి సభ్యులకు అదేశించారు. అదే విధంగా ఆర్డీఓ, మున్సిపల్ కమిషన్ ప్రతిరోజు పట్టణంలో మార్నింగ్ వాక్ లో ఏరియల్ సర్వే చేయాలని చెప్పినా అధికారులు మంత్రి మాటలను పట్టించుకున్న పాపానపోలేదని పలు పార్టీల నాయకులు, పట్టణ ప్రజల్లో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తూతూ మంత్రంగా డ్రైనేజీలోని పూడిక తీసి చేతులు దులుపుకున్నట్లు మెయిన్ రోడ్డుపై పారుతున్న ఈ వర్షపునీరే నిలువెత్తు సాక్ష్యమని పాలకులు, అధికారుల తీరుపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.