ఏపీని తాకిన నైరుతి.. రేపటి నుంచి వర్షాలే వర్షాలు

by srinivas |
ఏపీని తాకిన నైరుతి.. రేపటి నుంచి వర్షాలే వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా రేేపటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. మరోవైపు, తూర్పు ఈశాన్య బంగాళాఖాతం, మయన్మార్‌ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 11న అల్పపీడనంగా బలపడనుందని వాతావరణశాఖ తెలిపింది.

వీటి ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది ఇండియాలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఇటీవల ఐఎండీ ప్రకటించింది.

Advertisement

Next Story