- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైళ్లు అద్దెకివ్వబడును.. దరఖాస్తు చేసుకోండి
దిశ, కంటోన్మెంట్: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పర్యాటక రంగ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించింది. రైల్వే ప్రయాణాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొత్తగా 180 భారత్ గౌరవ్ రైళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైల్వే శాఖ నుంచి ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు రైళ్లను లీజుకు తీసుకునే అవకాశం కల్పించింది.
రైళ్లు అద్దెకు..
భారత దేశ గొప్పతనం, సాంస్కృతి వారసత్వాన్ని ప్రదర్శించేకు రైల్వే శాఖ నవంబర్ 23న భారత్ గౌరవ్ అనే స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ప్రయాణం కోసం రైళ్లను అద్దెకు ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. ఇది రైల్వే ప్రైవేటీకరణ కాదని, దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే చోట అన్ని సౌకర్యాలు అందించేందుకు ఈ సరికొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ స్కీమ్‌లో అద్దెకు తీసుకునే రైళ్లు తమకు నచ్చిన రూట్లలో నడుపుకోవచ్చు. అలాగే ప్రైవేటు ఆపరేటర్లు రూట్ ఛార్జీలు, ఇతర సేవలు, రూట్లు నిర్ణయించుకునే హక్కు ఉంటుందన్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా అద్దెకు తీసుకునే ప్రైవేటు ఆపరేటర్లకు అరేంజ్‌మెంట్ గడువు కనీసం రెండేళ్లు ఉంటుందని.. గరిష్టంగా కోచ్ కోడల్ లైఫ్ వ్యవధి వరకు ఉంటుందని ఓ రైల్వే అధికారి తెలిపారు.
ఇప్పటికే ఐఆర్ సీటీసీ సేవలు..
ఐఆర్‌సీటీసీ సైతం పర్యాటక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే రామాయణ ఎక్స్‌ప్రెస్ పేరుతో రాముడి జీవిత విశేషాలతో అనుసంధానమైన అనేక ప్రదేశాలలో ఈ రైలును నడుపుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ భాగంగా రైలు ప్రయాణం, వసతి, పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వంటివి ఉంటాయి. కొత్త బోగీలను కూడా ఆపరేటర్ అద్దెకు తీసుకోవచ్చు. రైల్వే ప్రమాణాల ప్రకారం.. రైలు డిజైన్, ఇంటీరియల్ డెకరేషన్ వంటి వాటికి అనుమతి ఉంటుంది. అయితే దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 180 కంటే ఎక్కువ రైళ్లను నడపడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. భారత్ గౌరవ్ పాలసీ ప్రకారం.. ప్రొఫెషనల్ టూర్ ఆపరేటర్లు టూరిస్ట్ రైళ్లను నడపడానికి అవకాశం ఉంటుంది. ఇందులోభాగంగా ఈ రైళ్ళ కోసం 3,033 బోగీలను సిద్ధం చేసింది. ఈ రైళ్లకు ప్రభుత్వం నిర్ణీత ఛార్జీలను నిర్ణయిస్తుంది. ఈ రైల్వే సేవల నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బోగీలను ఆధునికరించి, రైళ్లను నడుపుతారని చెప్పారు.www.indianrailway.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 10 పని దినాలలో ఈ ప్రక్రియ ప్రారంభించబడుతుంది. నమోదు చేసుకున్న సర్వీసు ప్రొవైడర్లు వారికి కావాల్సిన విధంగా (కనీష్టంగా 14 కోచులు లేదా గరిష్టంగా 20 కోచులు) ఎంపిక చేసుకునే అవకాశముంది.
ప్రకటనల కోసం..
అంతేకాక సర్వీసు ప్రొవైడర్లు వారి వ్యాపార రీత్యా కోచుల లోపల లేదా వెలుపల ఆయా రైళ్ల బ్రాండ్ ప్రకటనలుగానీ, మూడవ పార్టీ వ్యాపార ప్రకటనలను వేసుకునే స్వేచ్ఛ వారికుంది. భద్రతా నిబంధనలు అనుసరించి కోచుల లోపలి భాగాలలో పరిమితులకు అనుగుణంగా ఆధునీకరణ పనులు నిర్వహించుకునేందుకు అనుమతిస్తారు. ఆసక్తి గల సర్వీసు ప్రొవైడర్లు దీనికి సంబంధించి ఇతర వివరాల కోసం రైల్ నిలయం కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ప్రయాణికుల సేవలు) ఆర్.సుదర్శన్ ను గానీ లేదా [email protected] మెయిల్‌లో సంప్రదించవచ్చు.