- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇక నుంచి దూరంగా నిలబడి.. భూతద్దం ద్వారా పరిశీలిస్తారు
దిశ, వెబ్ డెస్క్: మనం రైల్లో వెళ్లేటప్పుడు మనకు ఓ వ్యక్తి ఎదురవుతాడు. అతను తెల్లటి షర్ట్, దానిపై నల్లటికోటు, మెడకు టై, నేమ్ ప్లేట్ ధరిస్తాడు. అతడిని అలా చూడగానే మనకు అనిపిస్తుంది ఇతను టికెట్ కలెక్టర్.. టికెట్ల చెక్ చేసేందుకు వచ్చాడు అని మనకు ఇట్టే అర్థమవుతుంది. అయితే.. ఆయన రాగానే మనం టికెట్ చూపిస్తాంటాం. కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా రైల్వే బోర్డు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో ఇక నుంచి టికెట్ చెక్ చేసే రైల్వే టికెట్ కలెక్టర్ రూపం మారిపోనున్నది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 100 జంట రైళ్లలో విధులు నిర్వర్తించే టికెట్ కలెక్టర్లు రైల్వేబోర్డు మార్గదర్శకాలను పాటించనున్నారు. కరోనా నేపథ్యంలో వీరు చేతులకు గ్లౌజులు, మాస్కులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, ముఖానికి అడ్డుపెట్టుకునే కవచాలు, సోపులు, టికెట్లను దూరం నుంచి పరిశీలించేందుకు భూతద్దాలను టికెట్ కలెక్టర్లకు రైల్వే బోర్డు ఇవ్వనున్నది. వీటిని ధరించి భూతద్దం ద్వారా వీరు టికెట్లను దూరంగా నిలబడి పరిశీలించనున్నారు.