రాయగిరి రైల్వే స్టేషన్‌ పేరు మార్పు

by Anukaran |   ( Updated:2020-09-21 10:40:34.0  )
రాయగిరి రైల్వే స్టేషన్‌ పేరు మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రికి చేరువగా ఉన్న రాయిగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే ప్రకటనను వెలువరించింది. సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట్ మార్గంలో ఉన్న ఈ రాయిగిరి స్టేషన్‌ను గత 18వ తేదీనే యాదాద్రి అని అధికారిక సంస్థ గుర్తించడం జరిగిందని ఆ ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Next Story