- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రాహుల్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా దినసరి, వలస కూలీల బతుకులు విషాదకరంగా ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ, నోయిడాల్లోని వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు రోడ్ల మీదకు వచ్చి వందల సంఖ్యలో ఒకే ప్రాంతంలో చేరారు. ఢిల్లీలోని రోడ్లపై వందల సంఖ్యలో కూలీలు గుమికూడిగ ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాహుల్ గాంధీ షేర్ చేసి, ఈ భయానకమైన పరిస్థికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రజలను ఇంతటి అసౌకర్యంలో నెట్టి వేశారు అని విమర్శించారు. ఇంతటి సంక్షోభంలో మన సోదర, సోదరీమణులకు కనీస గౌరవాన్ని వారికి మన మద్దతును అందించాలి. ఇది చాలా విషాదకరమైన సంఘటన అని, ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అని ట్వీట్ చేశారు. ‘లక్షలాది మంది మన సోదరి-సోదరీమణులు తమ ఉపాదిని కోల్పోయారు. ఇప్పుడు వారి ముందున్న ఏకైక మార్గం ఇల్లు చేరడమే. అయితే ఇల్లు చేరడానికి వారు చాలా కష్టపడుతున్నారు. మన భారతీయులతో ఈ విధంగా వ్యవహరించడం పట్ల నేను సిగ్గుపడుతున్నాను. వాస్తవానికి దీనిపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు’ అని రాహుల్ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలెవరూ తమ ఇంటిని దాటి బయటకు రావద్దని, ఒక చోట గుమికూడవద్దని ప్రభుత్వం గట్టిగా ఆదేశించింది.